
ఘనంగా కాపు సేవా సమితి వార్షికోత్సవం
కొరుక్కుపేట: కాపు సేవా సమితి – చైన్నె 9వ వార్షికోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. చైన్నె టి.నగర్‌లోని ఆంధ్రా క్లబ్‌లోని గోదావరి హాలు వేదికగా వేడుకలు జరిగాయి. వేడుకలకు హాజరైన సమితి అధ్యక్షుడు గూడపాటి జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ కలసి ఉందాం.. కలుపుకొని పోదాం అన్నదే లక్ష్యం అన్నారు. అన్ని వర్గాలతో మనమంతా ఐక్యంగా ముందుకు సాగుదామని అభిప్రాయపడ్డారు. కాపు సేవా సమితి చైర్మన్, సినీ నిర్మాత ఏఎం రత్నం సభకు అధ్యక్షత వహించారు. సమితి ప్రధాన కార్యదర్శి పి.ఆర్. కేశవులు, తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్– గుంటూరు. చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, రవినా హెల్త్‌కేర్ హాస్పిటల్– మధురవాయల్ ఎండీ డాక్టర్ ఏ. శ్రీనివాస్, హెచ్‌సీఎల్–టెక్ –చైన్నె వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర పినిశెట్టి పాల్గొని కాపు సేవా సమితి సేవలను కొనియాడారు. అనంతరం కాపు సేవా సమితి డైరెక్టరీ– 2025న ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు సమితి తరపున స్కాలర్‌షిప్‌లను అందజేశారు. బిట్రా గజగౌరి, సమితి కల్చరల్ సెక్రటరీ బీఆర్ భాస్కరరావు పాల్గొన్నారు. ముందుగా వై.వెంకటేశ్వర్లు హరికథ గానం అందరినీ అలరించింది.