ఉగ్రదాడిని ఖండించిన ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ | - | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిని ఖండించిన ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ

Apr 25 2025 8:02 AM | Updated on Apr 25 2025 8:02 AM

ఉగ్రదాడిని ఖండించిన ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ

ఉగ్రదాడిని ఖండించిన ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ

సాక్షి, చైన్నె : కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం ఆ అసోసియేషన్‌ అధ్యక్షులు కె శ్యామ రాజు మాట్లాడుతూ పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడితో తాము దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఇది చాలా భాద కరమైన ఘటనగా పేర్కొన్నారు. దేశంలోని పక్రృతి అందాలను, అతిథ్యాన్ని అనుభవించడానికి వచ్చిన సందర్శకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ అర్థరహిత హింసాత్మక చర్య విచారకరం అని వ్యాఖ్యలు చేశారు. మృత్తులకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. వారి కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నాం అని తెలిపారు. దేశ ప్రధాన మంత్రి ఈ వ్యవహారంలో తీసుకునే అన్ని చర్యలకూ ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ మద్దతు ఉంటుందన్నారు. పర్యాటకులకు సాధ్యమైన అన్ని సహాయాలను అందించాలని, ఎలాంటి రుసుం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

జూన్‌ 2న పున:ప్రారంభం

కొరుక్కుపేట: విద్యార్థులకు పరీక్షలు గురువారంతో పరీక్షలు ముగియడంతో శుక్రవారం నుంచి వేసవి సెలవులను ఇస్తున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్‌ ఎస్‌ కన్నప్పన్‌ ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సెలవులు అనంతరం రాష్ట్రంలోని ప్రభుత్వ , ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలను జూన్‌ 2న తెరుచుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. తమిళనాడు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సిలబస్‌ 10వ తరగతి , ప్లస్‌–1, ప్లస్‌– 2 విద్యార్థులకు మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్‌ 15 వరకు నిర్వహించారు. అలాగే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు విద్యార్థులకు గురువారం అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. దీంతో శుక్రవారం (ఏప్రిల్‌ 25) నుంచి విద్యార్థులకు వేసవి సెలవులను ఇచ్చినట్టు తెలిపారు. అయితే ఉపాధ్యాయులు పాఠశాల చివరి పనిదినమైన ఏప్రిల్‌ 30 వరకు విధులకు రావాలని, జవాబు పత్రం గ్రేడింగ్‌, విద్యార్థుల ప్రవేశం వంటి పనులు చూసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా హైకోర్టు మహిళాన్యాయవాద సంఘం విజ్ఞప్తి మేరకు మే 1 నుంచి రాష్ట్రంలోని అన్ని కుటుంబ సంక్షేమ కోర్టులకు రెండు వారాల పాటు వేసవి సెలవులను ప్రకటిస్తూ రిజిస్టార్‌ అల్లీ ఉత్తర్వూలు చేశారు.

పనిభారంతో గతనెలలో ఉద్యోగి ఆత్మహత్య

తిరుచ్చి ఏసీబీ కోర్టు జడ్జి చైన్నె బదిలీపై చర్చ

అన్నానగర్‌: తిరుచ్చి అవినీతి నిరోధక, లంచాల నిరోధక కోర్టు ప్రత్యేక న్యాయమూర్తిగా భాగ్యం ఉన్నారు. ఈమెను చైన్నెలోని స్మాల్‌ క్లెయిమ్స్‌ కోర్టు నెం. 9కి న్యాయమూర్తిగా బదిరీ చేస్తూ చైన్నె హైకోర్టు రిజిస్ట్రార్‌ అల్లి గురువారం ఆదేశించారు. ఇక తిరుచ్చి యాంటీ కరప్షన్‌ అండ్‌ యాంటీ లంచం ట్రిబ్యునల్‌లో ఆఫీసు అసిస్టెంట్‌గా అరుణ్‌ మారిముత్తు పనిచేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానికి కార్యాలయ పనిభారమే కారణమన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అరుణ్‌ మరిముత్తు పనిచేస్తున్న కోర్టు జడ్జిని బదిలీ చేయడం న్యాయశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మళ్లీ ఛాన్స్‌ దక్కేనా..?

స్టాలిన్‌తో వైగో భేటీ

సాక్షి, చైన్నె: మళ్లీ రాజ్యసభ సీటు వైగోకు దక్కేనా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. సీఎం స్టాలిన్‌తో ఆయన భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. కూటమి ధర్మం మేరకు ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైగోకు రాజ్యసభ సీటను డీఎంకే కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే గత ఏడాది జరిగిన లోక్‌ సభఎన్నికలలో ఆయన వారసుడు దురై వైగోకు తిరుచ్చి సీటు ఇచ్చి గెలుపుతో పార్లమెంట్‌కు పంపించారు. ఈ పరిస్థితుల్లో వైగో రాజ్యసభ పదవీ కాలం మరో నెలన్న రోజులలో ముగియనుంది. ఈసారి సీటును కూటమి ధర్మం మేరకు మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌కు ఇచ్చే దిశగా డీఎంకే కసరత్తులలో ఉన్నట్టు సమాచారం వెలువడింది. అదే సమయంలో మళ్లీ ఛాన్స్‌ కోసం వైగో పయత్నాలలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా సీఎం స్టాలిన్‌ను ఆయన కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఈ భేటీలో రాజ్యసభ సీటు ప్రస్తావనతో పాటూ ఇటీవల కాలంగా ఎండీఎంకేలో నెలకొన్న కొన్ని పరిస్థితులు రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ నిర్వాహక కమిటీ సమావేశంలో సమసినట్టుగా స్టాలిన్‌ దృష్టికి వైగో తీసుకెళ్లినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement