ఐఐటీ మద్రాస్‌లో ఘనంగా ఇన్‌స్టిట్యూట్ దినోత్సవం
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసులో బుధవారం సాయంత్రం 66వ ఇన్‌స్టిట్యూట్ దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు , అధ్యాపకులు, వివిధ రంగాలలో రాణించిన వారిని సత్కరించారు. 2016 నుంచి 2024 వరకు వరసగా తొమ్మిది సార్లు ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూషన్స్‌లో మొదటి స్థానంలో జాతీయ స్థాయిలో నిలుస్తూ వచ్చిన మద్రాసు ఐఐటీ ఖ్యాతిని చాటే విధంగా జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఏఎన్‌ఆర్‌ఎఫ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పూర్వ విద్యార్థి డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్ హాజరయ్యారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం – 2020 , 2023లో చట్టం అమలుకు దారితీసిన మరిన్ని చర్చల గురించి ప్రస్తావించారు. తమ ఫౌండేషన్ యొక్క ప్రత్యేక లక్షణాలు, విక్షిత్ భారత్ 2047 సాధాన గురించి వివరించారు. ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం సవాలుతో కూడుకున్నదని, ప్రతిఫలదాయకమైనదని వ్యాఖ్యానించారు.
అవార్డులు – గుర్తింపు
ఈ సందర్భంగా వేడుకలో అనేక అవార్డులను ప్రదానం చేశారు. అప్లైడ్ మెకానిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ ఎం. శ్రీనివాసన్, సివిల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పీఎస్ లక్ష్మీ ప్రియ సంయుక్తంగా శ్రీశ్రీమతి మార్తి అన్నపూర్ణ గురునాథ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ – 2025కు ఎంపిక చేశారు. ఎర్లీ కెరీర్ అవార్డు 2025ను డాక్టర్ సురేందర్ సింగ్ ( సివిల్ ఇంజనీరింగ్ విభాగం) డాక్టర్ అరవింద్ కుమార్ చంద్రన్( కెమికల్ ఇంజినీరింగ్ విభాగం) 2025 కెరీర్ అవార్డును ప్రొఫెసర్ సుశాంత కుమార్ పాణిగ్రాహి (మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం), ప్రొఫెసర్ ప్రభు రాజగోపాల్ ( మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం) ఇన్స్టిట్యూట్ బ్లూస్– 2025 అవార్డుకు విద్యార్థులు రాజగోపాల్ సుబ్రమణ్యం సి (సిల్వర్), సుఖేత్ (కాంస్య పతకం), అభినవ్ ఆర్ (కాంస్య పతకం) అందుకున్నారు. అలాగే మాలవ్య అవని తరుణ్, మిహిర లీల నడపనకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డులు, యువ పూర్వ విద్యార్థుల సాధకుల అవార్డులను కూడా ప్రదానం చేశారు. విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డును ప్రొఫెసర్ రమేష్ కె. సీతారామన్, ప్రొఫెసర్ శ్రీనివాసన్ నటరాజన్, ప్రొఫెసర్ సంధ్య ద్వారకాదాస్, డాక్టర్ విజయ్ నారాయణన్, శ్రీనివాస సుబ్రమణి , ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్, వెల్లయన్ సుబ్బయ్య, బి.కె. కామేశ్వరరావు, రమేష్ శ్రీనివాసన్, జయశ్రీ దేశ్‌పాండేలకు అందజేశారు. యువ పూర్వ విద్యార్థుల సాధకుల అవార్డు ప్రొఫెసర్ స్వరుణ్ కుమార్, ప్రొఫెసర్ వెంకట సుబ్రమణియన్ విశ్వనాథన్ అందుకున్నారు.
ఐఐటీ మద్రాస్‌లో ఘనంగా ఇన్‌స్టిట్యూట్ దినోత్సవం


