
పులి కడుపున పిల్లి పుడుతుందా?
తమిళసినిమా: పులి కడుపున పిల్లి పుడుతుందా? పులి పిల్లే పుడుతుంది. అదే విధంగా శ్రీపుత్రోత్సాహం పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొన పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందురుశ్రీ అన్న సుమతీ శతకాన్ని చిన్నప్పుడే చదువుకున్నాం. ఈ రెండింటికీ అర్హులు సూపర్ నట జంట సూర్య, జ్యోతికలు. వీరు నటనలోనూ, నిర్మాతలు గానూ అగ్రస్థానంలో ఉన్నారు. ఇక వీరి పుత్రిక రత్నం సాధన తల్లిదండ్రులైన సూర్య, జ్యోతికను ఆనందంలో ముంచెత్తుతోంది. అంతేకాదు గర్వపడేలా చేస్తోంది. సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్, దియా అనే కొడుకు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. కాగా వీరిలో కూతురు దియా సాధన గురించే వారు ఆనందంలో మునిగి తేలుతున్నారు. దియా దర్శకత్వంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా మెగా ఫోన్ పట్టి ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. దీని పేరు లీడింగ్ లైట్. ది అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఉమెన్ బిహైండ్ ద స్కీన్స్ అనే ట్యాగ్‌తో రూపొందిన ఈ డాక్యుమెంటరీ రెండు త్రిలోక ఇంటర్నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకుంది. అందులో ఒకటి స్క్రీన్ ప్లే అవార్డు కాగా మరొకటి ఉత్తమ విద్యార్థి డాక్యుమెంటరీ అవార్డు. ఈ విషయాన్ని నటుడు సూర్య, జ్యోతికలు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ, ఆ అవార్డులు, ధ్రువపత్రాలను పొందుపరిచారు. దీంతో భవిష్యత్‌లో ఈ నట కుటుంబం నుంచి మరో ప్రతిభావంతురాలైన దర్శకురాలు పరిచయమయ్యే అవకాశం లేకపోలేదు అనే భావన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.