అడవిలోకి చిరుత | - | Sakshi
Sakshi News home page

అడవిలోకి చిరుత

May 27 2024 6:10 PM | Updated on May 27 2024 6:10 PM

కొరుక్కుపేట: కడలూరు సమీపంలో ఇంట్లోకి చొరబడిన చిరుతపులిని అనస్తీషియా ద్వారా బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఆ చిరుతను అర్ధరాత్రి ముదుమలై అడవుల్లో విడిచిపెట్టారు. శనివారం నీలగిరి జిల్లా కూడలూరు సమీపంలోని సేముండికి చెందిన తంగసేన్‌ అనే వ్యక్తి వ్యవసాయ భూమిలోకి చిరుతపులి ప్రవేశించింది. ఇక్కడ ఉన్న ఇంటిని వ్యవసాయ కూలీలు తమ వస్తువులను నిల్వ చేసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా శనివారం ఒక కార్మికుడు కత్తిని తీసుకోవడానికి తలుపు తెరిచినప్పుడు లోపల చిరుతపులి కనిపించడంతో అతను వెంటనే తలుపులకు తాళం వేశాడు. అతను వెళ్లి యజమానికి సమాచారం ఇచ్చాడు. కూడలూరు డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి వెంకటేష్‌ ప్రభు, ముత్తు హిల్‌ టైగర్‌ రిజర్వ్‌ పశువైద్యాధికారి రాజేష్‌ కుమార్‌ అక్కడికి చేరుకున్నారు. మత్తు ఇంజక్షన్లు వేసి చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ నిమగ్నమైంది. దీంతో శనివారం రాత్రి 8 గంటల సమయంలో చిరుతపులికి మత్తు ఇంజక్షన్‌ వేశారు. చిరుత అపస్మారక స్థితిలోకి వెళ్లిందని నిర్ధారించుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను వల వేసి పట్టుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న చిరుతను బోనులో వేసి ముడుమలైకి తీసుకెళ్లారు. పట్టుబడిన చిరుతపులి ఏడేళ్ల మగ చిరుతపులిగా గుర్తించారు. చిరుత శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, స్పృహ కోల్పోవడంతో చిరుతను అర్ధరాత్రి ముదుమలై అడవుల్లో విడిచిపెట్టామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement