ఏడో అంతస్తు నుంచి దూకి నర్సు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఏడో అంతస్తు నుంచి దూకి నర్సు ఆత్మహత్య

Sep 10 2023 2:06 AM | Updated on Sep 10 2023 11:02 AM

- - Sakshi

కొరుక్కుపేట: ఏడో అంతస్తు నుంచి దూకి నర్సు ఆత్మహత్య చేసుకున్న ఘటన చైన్నె సమీపంలోని సిప్‌ కాట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ 30కి పైగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పనిచేస్తున్నాయి. మొత్తం 62 వేల మంది పనిచేస్తున్నారు. వారి వైద్య సౌకర్యం కోసం 7వ అంతస్తులో చిన్న ఆస్పత్రి నడుస్తోంది. ఇక్కడ 14 మంది వైద్యులు, నర్సులు ఉన్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు డాక్టర్లు, నర్సులు నైట్‌ డ్యూటీకి వచ్చారు.

రాత్రి 11 గంటల సమయంలో 7వ అంతస్తు నుంచి నర్సు కిందకు దూకింది. గార్డులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. కేలంబాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఆమెను ఈరోడ్‌ జిల్లా కళ్యాణూరుకు చెందిన పళనిస్వామి కుమార్తె జగశ్రీ (26)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్‌పట్టు ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement