పోటీకి సై అంటే.. డీఎంకేకు మద్దతు ఇస్తా! | - | Sakshi
Sakshi News home page

పోటీకి సై అంటే.. డీఎంకేకు మద్దతు ఇస్తా!

Sep 4 2023 1:18 AM | Updated on Sep 4 2023 9:40 AM

మీడియాతో మాట్లాడుతున్న సీమాన్‌  - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న సీమాన్‌

రామనాథపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసే పక్షంలో, ఆయనకు ప్రత్యర్థిగా డీఎంకే అభ్యర్థి రంగంలో ఉంటే వారికి మద్దతు

సాక్షి, చైన్నె : రామనాథపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసే పక్షంలో, ఆయనకు ప్రత్యర్థిగా డీఎంకే అభ్యర్థి రంగంలో ఉంటే వారికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ ప్రకటించారు. లేదంటే తాను బరిలో దిగుతామని స్పష్టం చేశారు. వివరాలు.. నామ్‌ తమిళర్‌ కట్చి కన్వీనర్‌ సీమాన్‌పై సినీ నటి విజయలక్ష్మి చేసిన ఆరోపణలు, ఫిర్యాదులు చర్చకు దారి తీసి ఉన్న విషయం తెలిసిందే.

సీమాన్‌ను విచారించేందుకు పోలీసులు సమన్లు సైతం జారీ చేసి ఉన్నారు. ఆయన్ని అరెస్టు కూడా చేయవచ్చు అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో విజయలక్ష్మికి వ్యతిరేకంగా నామ్‌ తమిళర్‌ కట్చి వర్గాలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఆదివారం అనూహ్యంగా సీమాన్‌ డీఎంకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

మీడియాతో మాట్లాడుతూ..
కోయంబత్తూరులో సీమాన్‌ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కంటే తన పార్టీ పెద్దదని, ఆ మేరకు తనకు ఓటు బ్యాంక్‌ ఉందన్నారు. అందుకే తనను ఎన్నికల వేళ ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా పరిణామాలను గుర్తుచేశారు. ఒకవేళ రామనాథపురం నుంచి ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తే, ఆయనకు ప్రత్యర్థిగా డీఎంకే అభ్యర్థిని నిలబెట్టిన పక్షంలో తాను అన్ని చోట్ల ఎన్నికల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అలాగే డీఎంకేకు మద్దతు ఇస్తానని స్పష్టం చే శారు. అయితే, ఎన్నికల్లో ప్రత్యక్షంగా బీజేపీని డీఎంకే ఒక్కటే ఢీకొట్టే పరిస్థితులు లేవుని , ఇందుకు గత ఎన్నికలే నిదర్శనంగా పేర్కొన్నారు. బీజేపీ పోటీ చేసే స్థానాలను మిత్ర పక్షాలకు డీఎంకే కేటాయిస్తున్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement