అవళ్‌ అప్పడిదాన్‌–2 | Sakshi
Sakshi News home page

అవళ్‌ అప్పడిదాన్‌–2

Published Thu, Jul 20 2023 1:34 AM

అవళ్‌ అప్పడిదాన్‌ –2 చిత్రంలో బేబీ కార్తీకతో స్నేహా పార్తీపరాజా - Sakshi

ఈగో క్లాష్‌ ప్రధానాంశంగా తమిళ సినిమా: భార్యభర్తల మధ్య అహం ఇతి వృత్తంతో 1978లో విడుదలైన చిత్రం అవళ్‌ అప్పడిదాన్‌. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ స్టూడెంట్‌ రుద్రయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా అలాంటి కాన్సెప్ట్‌తో తాజాగా రూపొందిన చిత్రం అవళ్‌ అప్పడిదాన్‌ –2. అబుదాహీర్‌, స్నేహా పార్తీపరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో రాజేశ్వరి, సుమిత్ర, అనితాశ్రీ,సుధాకర్‌, వెంకట్రామన్‌, ధనపాల్‌, బేబీ కార్తీక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్‌ఎం.చిదంబరం కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని యున్‌ ఫ్లిక్స్‌ పతాకంపై సెయ్యదు అబుదాహీర్‌ నిర్మించారు.

అరవింద్‌ సిద్ధార్‌ సంగీతాన్ని, వేదా సెల్వం ఛాయాగ్రహణను అందించిన అవళ్‌ అప్పటిదాన్‌– 2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్ర కథలో అన్నీ పాజిటీవ్‌ పాత్రలే. అందరూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ప్రాధాన్యతనిచ్చేవాళ్లే. విద్యావేత్తలైన భార్యాభర్తలు. వీరి భావాలు ఒకటి కాకపోయినా, ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా సీ్త్ర స్వేచ్ఛను గౌరవించే వ్యక్తిత్వం కలిగిన భర్త. ఆయన భార్య ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. అలాంటిది ఆమె ఒక రోజు పాఠశాలకు వెళ్లి అర్ధరాత్రి అయినా ఇంటికి తిరిగి రాదు. దీంతో భర్త ఆమె కోసం రాత్రి అంతా వీధుల్లో వెతుకుతాడు.

మరుసటి రోజు ఉదయం భార్య ఇంటికి తిరిగొస్తుంది. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావని ప్రశ్నంచిన భర్తకు భార్య బదులు చెప్పదు. అందుకు కారణం ఏమిటి? అసలు ఆమె ఆ రాత్రి ఎక్కడుంది? భర్తతో పాటు, ఇంట్లోవాళ్లు పలుమార్లు ప్రశ్నించినా ఆమె బదులు ఇవ్వక పోవడానికి కారణం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన అవళ్‌ అప్పడిదాన్‌– 2 కచ్చితంగా అన్ని వర్గాలనూ అలరిస్తుందని దర్శకుడు తెలిపాడు.

Advertisement
 
Advertisement