ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు వినూత్న పూజలు | - | Sakshi
Sakshi News home page

ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు వినూత్న పూజలు

Jun 22 2023 7:40 AM | Updated on Jun 22 2023 5:11 PM

- - Sakshi

చెరువు గట్టు వద్ద ఆత్మగా తిరుగుతున్న ఉదయ్‌వసంత్‌ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

తమిళనాడు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని సొరకాల్‌నత్తం గ్రామానికి చెందిన కేశవన్‌ ఇతని భార్య వాసంతి. వీరికి ఎయిల్‌ అరసన్‌, ఉదయ్‌వసంత్‌(20) పిల్లలున్నారు. ఎయిల్‌ అరసన్‌ సొరకాల నత్తం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా ఉంటున్నాడు. ఉదయ్‌వసంత్‌ రెండు నెలల క్రితం అదే గ్రామంలో బైకులో వెళుతున్న సమయంలో లారీ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు.

పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు అదే గ్రామంలోని శ్మశానంలో దహన క్రియలు చేశారు. చెరువు గట్టు వద్ద ఆత్మగా తిరుగుతున్న ఉదయ్‌వసంత్‌ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం మృతిచెందిన ఉదయ్‌వసంత్‌ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు చెరువు గట్టు వద్ద కుటుంబ సభ్యులు పూజలు చేశారు.

అక్కడ పూలకరగం పెట్టి నేలపై పసుపు, పుష్పాలు పెట్టి మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయ్‌వసంత్‌ చిత్రపటంతో పాటు కరగను చెరువు గట్టు నుంచి ఇంటికి మేళ తాళాల నడుమ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఒకటిన్నర కిలో మీటరు దూరం పసుపు నీల్లు, పుష్పాలు చల్లి ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ఉదయ్‌వసంత్‌ చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టి పూల మాల వేసి పూజలు చేశారు. మృతి చెందిన కుమారుడి ఆత్మ ఇంటికి రావాలని కుటుంబసభ్యులు పూజలు చేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement