విద్యార్థులను సన్నద్ధం చేయాలి
● ఈ నెల చివరి వారంలో
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
● ఏడు అంశాలపై ఎగ్జిబిట్‌ల
తయారీకి అవకాశం
● ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శనలు సైతం..
● సన్నాహాలు చేస్తున్న జిల్లా విద్యాశాఖ
అధికారులు
సూర్యాపేటటౌన్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచనా విధానానికి పదును పెట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. విద్యార్థులను ప్రయోగాలు, నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డులు పొందిన ఎగ్జిబిట్‌ల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని వెయ్యికి పైగా పాఠశాలల విద్యార్థులు ఎగ్జిబిట్‌లు రూపొందించేలా హెచ్‌ఎంలు, గైడ్ టీచర్లు ప్రోత్సాహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆదేశాల మేరకు ఈ నెల చివరి వారంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది.
ఏడు అంశాలపై ప్రదర్శనలు
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు అంశాలపై ఎగ్జిబిట్స్ ప్రదర్శించనున్నారు. శ్రీసైనన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ సస్టెయినబుల్ అండ్ వికసిత్ భారత్‌శ్రీ ప్రధాన అంశంగా ఉండగా ఇందులో ఏడు ఉప అంశాలను చేర్చారు. మెరుగైన జీవనం కోసం కృత్రిమ మేథస్సు (ఏఐ), హరిత ఇంధనం–పర్యావరణ పరిరక్షణ, గణిత నమూనాలు–కంప్యూటేషనల్ థింకింగ్, ఆరోగ్యం–పరిశుభ్రత–పారిశుధ్యం, స్వదేశీ వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ ప్రాంతాల పరివర్తనకు విజ్ఞానశాస్త్రం, విపత్తుల నిర్వహణ అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది.
ఇన్‌స్పైర్‌కు 40 ప్రాజెక్టులు
విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్‌స్పైర్ మనక్ ప్రదర్శనకు సూర్యాపేట జిల్లాలో 40 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఒక్కో ప్రాజెక్టుకు రూ.10వేల చొప్పున విద్యార్థుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఆయా ప్రాజెక్టులను జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు. దాంతో పాటు జిల్లాలోని 31 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులు సైతం వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొననున్నారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలు, ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
గతేడాది 318 ప్రాజెక్టులు
గతేడాది నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో 318 ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో రాష్ట్ర స్థాయికి 53 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న వాటిలో ఒక ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఈ ఏడాది 400 ప్రాజెక్టులు వచ్చేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్టు వచ్చేలా ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రస్థాయి పోటీలకు అవకాశం..
జిల్లా స్థాయి ప్రదర్శనల్లో పాల్గొన్న ఎగ్జిబిట్స్‌లో ప్రతి ఉప అంశం నుంచి ఉత్తమ ప్రదర్శనను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఐదు ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల నుంచి ఒక్కో ఉప అంశానికి ఒకటి చొప్పున ఏడు ప్రదర్శనలకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం రాష్ట్రస్థాయి ప్రదర్శనల్లో పాల్గొననున్నారు. ఉపాధ్యాయుల బోధనాభ్యసన సామగ్రి, డీఈఎల్‌ఈడీ, బీఈడీ శిక్షణార్థులకు కూడా ప్రత్యేకంగా ఒక్కో ప్రదర్శన కేటాయించారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న ప్రాజెక్టులకు దక్షిణ భారత సైన్స్ ఫెయిర్–2027, జాతీయ స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శనను ఒకే వేదికపై నిర్వహించాలని సీఈఆర్‌టీ సూచించింది. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంగణాన్ని గుర్తించి ఈ నెల మూడో, లేదా నాలుగో వారంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించేందుకు సన్నద్దం చేస్తున్నాం. ఈ ప్రదర్శనల కోసం ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను సిద్ధం చేయాలి. మూడు రోజులపాటు జిల్లా స్థాయి ప్రదర్శనలు నిర్వహించి ఉత్తమ మైన వాటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాజెక్టుల రూపకల్పనపై దృష్టి పెట్టాలి. – ఎల్.దేవరాజు,
జిల్లా సైన్స్ అధికారి, సూర్యాపేట


