ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

సూర్యాపేట(భానుపురి) : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, జిల్లా, మండల స్థాయి ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో మొత్తం 56 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సీపీఓ కిషన్‌, సీఎఫ్‌ఓ దామోదర్‌రెడ్డి, డీఎస్‌ఓ మోహన్‌బాబు, డీడబ్ల్యూఓ నరసింహారావు, డీపీఓ యాదగిరి, డీఐఈఓ సులోచనా రాణి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఉపేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement