నలభై మంది కూలీలకు ఒక మేట్‌ | - | Sakshi
Sakshi News home page

నలభై మంది కూలీలకు ఒక మేట్‌

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

సూర్యాపేట (ఆత్మకూరు.ఎస్‌) : వీబీ జీరామ్‌జీ పనుల నిర్వహణకు ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని, అందుకు గ్రామపంచాయతీ సర్పంచ్‌తో పాటు కార్యదర్శి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు బాధ్యత తీసుకోవాలని డీఆర్డీఓ సన్యాసయ్య సూచించారు. సోమవారం మండలంలోని దాచారం గ్రామంలో ఉపాధి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న ఫాంపాండ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రతి కుటుంబానికి 125 రోజుల పని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతులు ఫాంపాండ్‌, నీటి కుంటలు, ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. ఆయన వెంట దాచారం సర్పంచ్‌ గంగరబోయిన ఎల్లమ్మ, ఏపీఓ ఈశ్వర్‌, ఈసీ అరుణ జ్యోతి, టీఏ అమర్‌సింగ్‌, పంచాయతీ కార్యదర్శి తేజస్విని, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చంద్రకళ ఉన్నారు.

శివాలయంలో

ప్రత్యేక పూజలు

మేళ్లచెరువు : మండలకేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దీపాలు వెలిగించారు. స్వామివారికి గణపతిపూజ, పుణ్యహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, ఆలయ చైర్మన్‌ శాగంరెడ్డి శంభిరెడ్డి పాల్గొన్నారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి

నల్లగొండ : గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్‌ కోరారు. దీపావళి పండుగ సందర్భంగా

ఆదివారం నరకాసురుని వేషధారణలో నల్లగొండలోని వివిధ ప్రాంతాల్లో వినూత్న ప్రచారం నిర్వహించారు. గంజాయ్‌, డ్రగ్స్‌ వంటి రాక్షసులు మీ శరీరాన్ని, జీవితాలను పిప్పి చేస్తున్నారని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలని, వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement