కాలుష్య పరిశ్రమను మూసి వేయాలి | - | Sakshi
Sakshi News home page

కాలుష్య పరిశ్రమను మూసి వేయాలి

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

సూర్యాపేట : కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) క్లోజర్‌ ఆర్డర్‌ జారీ చేసినప్పటికీ దాసాయిగూడెంలోని కోహెన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌(గతంలో సువెన్‌ ఫార్మాసుటికల్స్‌) పరిశ్రమలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. సోమవారం ఉదయం దాసాయిగూడెం, వస్రాం తండా గ్రామస్తులు పరిశ్రమ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవల రసాయన లీకేజీ ఘటనలో కెమిస్ట్‌ మృతి చెందడంతో పరిశ్రమను మూసివేయాలని, దానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని పీసీబీ ఆదేశించినట్లు తెలిపారు. అధికారులు పరిశ్రమకు విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించినప్పటికీ సోలార్‌ విద్యుత్‌తో ప్లాంట్‌, ల్యాబ్‌ నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. రాత్రివేళల్లో రసాయనాల వాహనాలు పరిశ్రమ నుంచి బయటకు వెళ్తున్నాయని, పరిశ్రమ నుంచి వచ్చే పొగలు, దుర్వాసనతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరి శ్రమ యాజమాన్యంపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకొని నిరసనకారులను చెదరగొట్టారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement