ఎసా్సరెసీ్ప కాల్వ భూములు కబ్జా | - | Sakshi
Sakshi News home page

ఎసా్సరెసీ్ప కాల్వ భూములు కబ్జా

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : మండలంలోని ఎస్సారెస్పీ కాల్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కాల్వకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసి ఇళ్లు, షెడ్లు, దుకాణాలు నిర్మిస్తున్నారు. ఆక్రమణలతో కాల్వ కుంచించుకు పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

కాల్వ గట్లు మాయం..

మండలంలో ఏపూరు, ఆత్మకూర్‌, కోటినాయక్‌ తండా, కొత్త తండా, రామన్నగూడెం గ్రామాల పరిధిలో ఎస్సారెస్పీ కాల్వ గట్లు దాదాపు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు 20 నుంచి 30 అడుగుల వెడల్పు ఉన్న కాలువ ఇప్పుడు 10 అడుగులకు కుంచించుకుపోయింది. దాంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడడంతో పాటు ఆయకట్టు రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు దారిలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల కాలువలోనే చెత్త, శిథిలాలు వేసి పూడ్చి వేసి పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. మరికొన్ని చోట్ల కాలువ భూమిలోనే బోర్లు వేసి సాగు చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

వర్షం వస్తే ఇబ్బందే..

కాలువ భూమి ఆక్రమణ వల్ల భారీ వర్షం వస్తే నీరు పొంగి పంటలు మునిగిపోతున్నాయి. అయినా అధికారులు కాల్వలో పూడిక తొలగించి వెడల్పు చేయడం గానీ, ఆక్రమణలు తొలగించి కాల్వను వెడల్పు చేయడం వంటి వాటిపై దృష్టి సారించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

సర్వేచేస్తాం : ఇరిగేషన్‌ ఏఈ చరణ్‌రాజు

ఎస్సారెస్పీ కాల్వ భూముల ఆక్రమణలపై పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు అందాయి. సర్వే చేయిస్తాం. కొన్నిచోట్ల పరిశీలన చేశాం. ఆక్రమణలు తొలగించాం. మిగిలిన చోట్ల ఆక్రమణలు ఉంటే తొలగింపునకు చర్యలు చేపడతాం.

కాల్వ భూముల్లో యథేచ్ఛగా నిర్మాణాలు

పట్టించుకోని సంబంధిత అధికారులు

కాలువ కుంచించుకు పోతుందని రైతుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement