తుంగతుర్తి(నూతనకల్) : కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్చా వ్యాపార ఒప్పందాలను రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించే కిసాన్‌సభ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం మండలంలోని చిల్పకుంట్లలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ స్వామినాధన్ సిఫారసుల మేరకు రైతులకు మద్దతు ధర అందించాలన్నారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు రూ.6వేల పింఛన్ అందించాలని, సహకార సంఘాలను బలోపేతం చేసి కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, పులుసు సత్యం, సర్పంచ్ అంజపల్లి నర్సమ్మ, సామ సురేందర్‌రెడ్డి, చూడి మధుసూదన్‌రెడ్డి, గజ్జెల శ్రీనివాస్‌రెడ్డి, తొట్ల లింగయ్య, జటంగి లింగయ్య, కట్టా నర్సిరెడ్డి పాల్గొన్నారు.


