శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో జిల్లా రైతులు ఆందోళన చెందారు. అత్యధికంగా నూతనకల్ మండలంలో 45.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుంగతుర్తి లో 15.7, మద్దిరాల 25.1, జాజిరెడ్డిగూడెం 13.4, సూర్యాపేట 13.1, ఆత్మకూరు 27.5, మోతె 1.5, మేళ్లచెరువు 4.5, చింతలపాలెం 2.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నాగారం, చివ్వెంల, అనంతగిరి, గరిడేపల్లి మండలాల్లోనూ చిరుజల్లులు కురిశాయి.
భానుపురి (సూర్యాపేట) : తుపానులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మొన్నటి అర్నబ్ తుపాను నుంచి మొదలుకొని నిన్నటి మురసు తుపాను వరకు వ్యవసాయ పనులకు ఆటంకంగా మారాయి. దీంతో కొందరు రైతులు వరికోతలు, రెండో విడత పత్తితీత పనులు ఆపేశారు. మరికొందరు వరికోతలు కోసినా ధాన్యం తడుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం కారణంగా జిల్లాలోని ఏ చెరువుల్లోకి చుక్కనీరు చేరిన దాఖలాలు లేవు. మూడు రోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఎనిమిది మండలాల్లో 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అర్నబ్ తుపాను నుంచి..
జిల్లాలో గతనెల 29 నుంచి వాతావరణం మారిపోయింది. నాటినుంచి తుపాను కారణంగా పలుచోట్ల చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురవడం మొదలయ్యాయి. ఈ తుపాను మూడు నాలుగు రోజులపాటు జిల్లాలో రైతాంగాన్ని పరుగులు పెట్టించింది. కొందరు రైతులు పొలాలు ఆగం అవుతాయని చెప్పి పచ్చిధాన్యాన్ని మార్కెట్లో తరలించి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వెంటనే మురసు తుపాను రూపంలో మళ్లీ రెండు రోజులపాటు ముసురు పెట్టింది. ఈ రెండు తుపాన్లు వెళ్లిపోయిన తర్వాత కూడా జిల్లాను వర్షం వీడడం లేదు.
నిలిచిపోయిన వ్యవసాయ పనులు
వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, కుంటల్లోకి ఏమాత్రం వరద నీరు చేరడం లేదు. భూగర్భ జలాలు సైతం పెరగడం లేదు. అయినా జిల్లా రైతాంగానికి వ్యవసాయ పనులు మందగించాయి. ప్రధానంగా కోతకు వచ్చిన పరిపొలాలను ఈ వర్షం కారణంగా నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే రెండోసారి పత్తి తీత పనులు ఆగిపోయాయి. పలుచోట్ల పత్తితీత ముందుకు సాగక పోవడంతో తడిసి చెట్టుపై నుంచి పత్తి కింద పడేలా తయారైంది. ఇదిలా ఉంటే పలుచోట్ల రైతులు సాగుచేసిన వేరుశనగ, పెసర, మినుము లాంటి ఆరుతడి పంటలకు ఈ వర్షాలు అనుకూలంగా మారాయి.
ఆత్మకూర్ పరిధిలో వర్షం కారణంగా
కోయకుండా వదిలేసిన వరిపొలం
సూర్యాపేట సమీపంలో చేలులోనే
తడిసి ఉన్న పత్తి
ఫ ‘మురసు’ ప్రభావంతో మూడు రోజులుగా మోస్తరు వర్షాలు
ఫ ఇప్పటికే ముంచిన అర్నబ్ తుపాను
ఫ పత్తితీత పనులకు ఆటంకం
ఫ అక్కడక్కడా నిలిచిన వరికోతలు
ఫ ఆందోళనలో రైతాంగం


