ప్రతి ఇంట్లో వెలుగులు నిండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంట్లో వెలుగులు నిండాలి

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌ : చీకటిని పారదోలే వెలు గుల పండుగ దీపావళి అని.. దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నరకాసుర వదతో దీపావళి పండుగ జరిగినట్లు.. మన తెలంగాణలోనూ చీకట్లు తొలగి మళ్లీ అభివృద్ధితో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. బాణసంచా పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

ఎస్పీ శుభాకాంక్షలు..

దీపావళి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీస్‌ శాఖ తరఫున ఎస్పీ నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. బాణాసంచా విక్రయించే వ్యాపారులు సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని కోరారు.

మిల్లర్ల సిండికేట్‌పై

చర్యలు తీసుకోవాలి

భానుపురి (సూర్యాపేట) : సిండికేట్‌గా మారి ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న జిల్లాలో రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం, రైతుసంఘం నాయకులు కందాల శంకర్‌రెడ్డి, మట్టిపల్లి సైదులు, కోట గోపి, వి.రవి, జె.నరసింహారావు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పురస్కారాలకు

దరఖాస్తుల ఆహ్వానం

భానుపురి (సూర్యాపేట) : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 3న రాష్ట్ర ప్రభుత్వం అందించే రాష్ట్రస్థాయి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల అభ్యున్నతికి, సాధికారతకు విశేష కృషిచేసిన ఉత్తమ వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు హైదరాబాద్‌లో నిర్వహించి వేడుకల్లో రాష్ట్ర స్థాయి అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు. దరఖాస్తు నమూనా, పూర్తి మార్గదర్శకాలను అధికారిక వెబ్‌సైట్‌ https://depwdsctgp.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement