హుజూర్‌నగర్ : పాఠశాలల్లో అభివృద్ధి పనులను ఈనెల 20లోపు పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శనివారం హుజూర్‌నగర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. 9వ తరగతి విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని చదివించి ప్రశ్నలు అడిగి వారి నుంచి జవాబులు రాబట్టారు. అనంతరం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. వివిధ విభాగాల పనితీరు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల కలెక్టర్ మాట్లాడుతూ ప్లే గ్రౌండ్ లెవల్ చేయించి బేస్‌బాల్, వాలీబాల్ కోర్టును తయారు చేయాలని సూచించారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి మేరకు ఆసుపత్రిలో సిబ్బంది కొరతను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం రామస్వామి గట్టు సమీపంలో సింగిల్ బెడ్‌రూమ్‌ల కాలనీ గురించి ఆర్‌డీఓ, తహసీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కత్తుల నాగేందర్, డాక్టర్స్ నక్క రవి, యోగేందర్, హెచ్‌ఎం దాడి నర్సిరెడ్డి, డీఈ రమేష్, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఓటు కోల్పోయిన వారికి మరో అవకాశం
భానుపురి (సూర్యాపేట) : సర్ ముసాయిదాలో పేర్లు నమోదు కాని వారికి తుది ఓటరు జాబితాలో తమ పేరు చేర్చుకునేందుకు ఎన్నిక సంఘం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్‌లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటు కోల్పోయిన వారు 96,307 మంది ఉన్నారని పేర్కొన్నారు. వీరంతా ఎన్యుమరేషన్ ఫారం పూర్తిచేసి సమర్పిస్తే సరిపోతుందని, ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


