మట్టపల్లిలో శివపార్వతుల మాస కల్యాణం | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లిలో శివపార్వతుల మాస కల్యాణం

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో గల శివాలయంలో శనివారం శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామి వారి మాస కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, రక్షాబంధనం, రుత్వి గ్వరణం, పుణ్యాహవచనం, మధుఫర్కపూజ చేశారు. శని త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు శివాలయంలో తెల్లవారుజామునే ప్రదక్షిణలు గావించి నవగ్రహాలకు, ప్రత్యేకంగా శనీశ్వరునికి తైలాభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని సందర్శించుకున్న భక్తులకు అన్నదానం చేశారు. అంతకుముందు శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం నిర్వహించి స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement