దళిత నిరుపేదలకు అండగా స్వేరోస్‌ | - | Sakshi
Sakshi News home page

దళిత నిరుపేదలకు అండగా స్వేరోస్‌

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

చిలుకూరు : దళిత నిరుపేదలకు స్వేరోస్‌ అండగా ఉంటుందని ఆ సంస్థ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. చిలుకూరు హరిజనవాడకు చెందిన నిరుపేద కందుకూరి గురవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబానికి స్వేరోస్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇంటి నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలను స్వేరోస్‌ ఆదుకుంటుందని, ఇప్పటి వరకు చాలా కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని చెప్పారు. అనంతరం స్వేరోస్‌ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్వేరోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని వీరయ్య, జిల్లా అధ్యక్షుడు పడిమర్తి దశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి శివకృష్ణ, ఈసీ మెంబర్‌ కందుకూరి ఉపేందర్‌, స్వేరోస్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఫ సంస్థ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement