పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

సూర్యాపేట : ఎల్‌ఐసీ 1996 బ్యాచ్‌ ఉద్యోగుల పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు గుణశేఖర్‌, రఘు అన్నారు. ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సూర్యాపేట బ్రాంచ్‌ అధ్యక్షుడు మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన గురువారం సూర్యాపేట ఎల్‌ఐసీ బ్రాంచ్‌ కార్యాలయంలో ఐసీఈయూ సూర్యాపేట, కోదాడ శాఖల వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గుణశేఖర్‌, రఘు మాట్లాడుతూ.. 1996 నోటిఫికేషన్‌ ద్వారా 2012, 2013లో ఉద్యోగంలో చేరామని ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయలేదన్నారు. ఏఐఐఈఏకు 70 ఏళ్ల చరిత్ర ఉందని ఎన్ని సవాళ్లు ఎదురైనా ఉద్యోగుల పక్షాన అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఐఐఈఏ ఉమ్మడి నల్లగొండ జిల్లా జనరల్‌ సెక్రెటరీ బాలస్వామి, నాయకులు నవీన్‌ బాబు, జావిద్‌, ఐసీఈయూ సూర్యాపేట బ్రాంచ్‌ అధ్యక్షుడు మోహన్‌ సింగ్‌, కార్యదర్శి ప్రభాకర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవయ్య, డివిజన్‌ కౌన్సిల్‌ సభ్యుడు రామయ్య, కోదాడ బ్రాంచ్‌ అధ్యక్షుడు విజయ్‌ శంకర్‌, కార్యదర్శి సాయిహరి, డివిజన్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కన్నయ్య, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement