అర్వపల్లి: జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని మండలంలోని పర్సాయపల్లి సర్పంచ్ బానోతు సైదులు కోరారు. బుధవారం పర్సాయపల్లి గ్రామంలో నిర్వహించిన హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామదాసు, కార్యదర్శి స్రవంతి, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.


