ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు తగదు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు తగదు

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

జై కిసాన్‌

నల్లగొండలో జరగనున్న ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభల సందర్భంగా సూర్యాపేటలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 36 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్‌ సమీపంలోని బాలాజీ రైస్‌ మిల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్త బస్టాండ్‌, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, వాణిజ్య భవన్‌, పొట్టి శ్రీరాములు సెంటర్‌, పూల సెంటర్‌, పోస్ట్‌ ఆఫీస్‌ మీదుగా ఎన్టీఆర్‌ పార్క్‌ వరకు సాగింది.

సూర్యాపేటలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి,

రైతు సంఘం నాయకులు

సూర్యాపేట (భానుపురి) : ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేయడం హేయమైన చర్య అని తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్‌ అన్నారు. ఓ ప్రయాణికురాలు బస్సులో నుంచి తోసివేసిన ఘటనలో గాయపడిన మహిళా కండక్టర్‌ గుండ్ల ప్రవళిక చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందగా.. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో గేటు ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుంకరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలన్నారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా కండక్టర్‌ ప్రవళిక కుటుంబానికి 5 ఎకరాల భూమి, రూ.ఐదు కోట్ల ఎక్స్‌గ్రేషియా అందజేయాలన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నల్లగొండ రీజియన్‌ కార్యదర్శి బత్తుల సుధాకర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ కరువవుతుందని, ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ నల్లగొండ రీజియన్‌ జాయింట్‌ సెక్రెటరీ బుచ్చయ్య, సూర్యాపేట డిపో కార్యదర్శి మాచర్ల భాస్కర్‌, సూర్యాపేట డిపో చైర్మన్‌ ఎండీ అబ్దుల్‌ గని, ఎంఆర్‌ స్వామి, ఆర్‌ఆర్‌ రావు, మాచర్ల లచ్చయ్య, సేవియా, మంజుల, పుష్పలత, సుస్మిత, జీవిత, ఇందిర పాల్గొన్నారు.

ఫ తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement