వంతెన శిథిలం.. జర పైలం | - | Sakshi
Sakshi News home page

వంతెన శిథిలం.. జర పైలం

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

నడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కట్టల నిర్వహణ కరువై అధ్వానంగా మారాయి. పలు చోట్ల పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి, కట్టకు ఇరువైపులా కంప చెట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో స్థానిక ప్రజలు, రైతుల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

గుంతలమయం.. రాకపోకలు నరకప్రాయం

నడిగూడెం మండల కేంద్రం సమీపంలోని కృష్ణానగర్‌ డీప్‌కట్‌ నుంచి రామాపురం, చాకిరాల, సిరిపురం గ్రామాల మీదుగా జిల్లా సరిహద్దులోని కాగితరామచంద్రాపురం వరకు నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ విస్తరించి ఉంది. కాల్వకు ఇరువైపులా కట్టలు ఉండగా.. ఈ మార్గాల్లో అనేక చోట్ల లోతైన గుంతలు ఏర్పడ్డాయి. సిరిపురం డీప్‌కట్‌ సమీపంలో కాల్వ కట్టపై పలు చోట్ల రైతు మోటార్ల నీరు ప్రవహిస్తుండటంతో బుంగలు పడి రహదారి గుల్లగా మారింది. చిన్న వర్షం పడినా కట్టంతా బురదమయంగా మారుతోంది. దీనికితోడు కాల్వ ఎడమ కట్ట వైపు రహదారికి ఇరువైపులా కంపచెట్లు దట్టంగా అల్లుకుపోయాయి. కృష్ణానగర్‌ డీప్‌కట్‌ నుంచి రామాపురం వరకు, చాకిరాల నుంచి సిరిపురం వరకు రహదారి దెబ్బతిని గుంతలు, బురదతో నిండిపోవడంతో ద్విచక్రవాహనాలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వెళ్లే రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కట్టపై శాశ్వత మరమ్మతులు చేపట్టి, ముళ్లకంపలను తొలగించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

ఫ నడిగూడెం పరిధిలో

గుంతలమయంగా సాగర్‌ ఎడమ కాల్వ కట్ట

ఫ చాకిరాల సమీపంలో

వంతెన ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement