కోదాడ: మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగిస్తున్న సీఎంఆర్ బియ్యం నాణ్యత విషయంలో అధికారులు ఏమాత్రం రాజీపడొద్దని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కోదాడలోని స్టేట్‌వేర్ హౌసింగ్ బఫర్ గోదాములను ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బియ్యం శాంపిల్స్ తీయించి, నాణ్యత పరీక్షలు చేయించారు. గోదాముల్లో సన్న బియ్యం నిల్వ విషయంలో గోదాం ఇన్‌చార్జి, టెక్నికల్ అసిస్టెంట్ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. గోదాముల్లో హమాలీలతో మాట్లాడారు. వారు తమకు లేబర్‌కార్డులను ఇవ్వాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ సంతోష్‌కిరణ్, గోదాము మేనేజర్ సందీప్, టెక్నికల్ అసిస్టెంట్లు భాస్కర్‌రెడ్డి, అరుణ ఉన్నారు.
జలసిరి పనులు వేగవంతం చేయాలి
మునగాల: వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టిన జలసిరి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన జలసిరి పనులను ఆయన తనిఖీ చేశారు. గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ సోక్‌పిట్, మ్యాజిక్ డ్రైన్స్ పనులతో పాటు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలోని రూఫ్‌టాప్ ఇంకుడు గుంతల పనులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన నాణ్యత, టాయిలెట్ల నిర్వాహణ, పరిశుభ్రతను పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, ఇన్‌చార్జి ఎంపీడీఓ నరేష్, తహసీల్దార్ సరిత, సర్పంచ్ విలాసకవ వసుంధర, ఉపసర్పంచ్ నాగేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


