మట్టపల్లిలో నిత్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లిలో నిత్య కల్యాణం

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీ ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహో మం, పంచామృతాభిషేకం చేపట్టారు. స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం, నిత్య కల్యాణతంతు పూర్తిచేశారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ప్రతిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement