సూర్యాపేటటౌన్ : ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తూ బాధితులకు భరోసానివ్వాలని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణిలో ఆయన మాట్లాడారు. ప్రజలు గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని, సమస్యలు వచ్చినప్పుడు దాడులకు పాల్పడకుండా ఇరువర్గాలు పెద్దల సమక్షంలో సామరస్యపూర్వకంగా, చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలన్నారు.
తుపానుతో అప్రమత్తంగా ఉండాలి
బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏర్పడిన మురసు తుపాను ప్రభావం జిల్లాపై ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీ సుల సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో
కాంగ్రెస్‌దే విజయం
తిరుమలగిరి (తుంగతుర్తి) : నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తిరుమలగిరి మున్సిపాలిటీలో ఓటరు నమోదు సహాయక కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 6 వరకు గడువు ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పాలకుర్తి రాజయ్య, ఎల్సోజు నరేష్, కౌన్సిలర్లు మల్లయ్య, బత్తుల శ్రీను, అంజి, ఎర్ర యాదగిరి, కందుకూరి లక్ష్మయ్య, బోయపల్లి కిషన్, ప్రేమ్‌ప్రసాద్, బర్ల సోమనర్సయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలను
ఎంపిక చేసుకోవాలి
పెన్‌పహాడ్ : ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలని కేవీకే శాస్త్రవేత్త పి.అక్షిత్‌సాయి అన్నారు. సోమవారం ఖేత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెన్‌పహాడ్ మండలం చీదెళ్లలోని రైతు వేదికలో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. రైతులు యాసంగి పంటల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే పరిస్థితులు ఏర్పడితే భూగర్భ జలాలపై మరింత ఒత్తిడి పెరిగేవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పెసర, మినుము, బొబ్బెర, శనగ, వేరుశనగ వంటి పంటలను సాగు చేయాలన్నారు. పలు సూచనలు చేశారు. సదస్సులో ఏఓ అనిల్‌కుమార్, ఏఈఓ రాకేష్, సర్పంచ్ వరికల్లు పద్మ శ్రీనివాస్, రైతులు గుర్రం అమృతారెడ్డి, శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.


