భానుపురి (సూర్యాపేట) : ప్రజావా ణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 104 అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాదారు. ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఈఓ శ్రీనివాసరావు, డీఎస్‌ఓ మోహన్‌బాబు, డీడబ్ల్యూఓ నరసింహారావు, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సీపీఓ కిషన్, సీఎఫ్‌ఓ దామోదర్‌రెడ్డి, శ్రీనివాసరావు, డీఐఈఓ సులోచన రాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే
బియ్యం విక్రయించాలి
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే జిల్లాలో బియ్యం విక్రయించాలని, నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సూర్యాపేట జిల్లా హోల్‌సేల్ రైస్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బియ్యం ధరలను నియంత్రిస్తూ వినియోగదారులకు తక్కువ ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ డీలర్లు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి.హరిసింగ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్‌బాబు, డీఎం శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది, జిల్లాలోని రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ రైస్ డీలర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


