టోకెన్‌ పద్ధతిన ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

టోకెన్‌ పద్ధతిన ధాన్యం కొనుగోళ్లు

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో వారం రోజుల తరువాత సోమవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. టోకెన్‌ పద్ధతిన రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చినట్లు మార్కెట్‌ కార్యదర్శి శంషేర్‌ తెలిపారు. మార్కెట్‌ యార్డుకు 14,967 బస్తాల ధాన్యం వచ్చిందని, సన్న ధాన్యం 12,145 బస్తాలు రాగా క్వింటాకు గరిష్టంగా రూ.3,090, కనిష్టంగా రూ.2,300, దొడ్డు ధాన్యం 2,620 బస్తాలు రాగా క్వింటాకు గరిష్టంగా రూ.2,269, కనిష్టంగా రూ.2061 ధర పలికింది.

నేడు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

తుపాను కారణంగా భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండటంతో మంగళవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్‌ కార్యదర్శి శంషేర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement