● ఏమిస్తారో మీరే తేల్చుకోండి ● డిఫాల్ట్ మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు
భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల్లో ధాన్యం నిల్వలను పెంచుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వానాకాలంతో పాటు యాసంగి సీజన్లలో సేకరించే ధాన్యం తక్కువ మొత్తంలో ఉండనున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మిల్లర్లు బకాయి పడిన ధాన్యాన్ని రాబట్టేందుకు పౌరసరఫరాల శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రభుత్వానికి సీఎంఆర్ బకాయిపడిన మిల్లర్లకు ప్రభుత్వం 45 రోజుల గడువు ఇచ్చింది. పలు సీజన్లలో సీఎంఆర్ ఇవ్వకుండా బకాయి పడినవారు బియ్యం ఇస్తారా..? లేదంటే డబ్బులు ఇస్తారా..? అన్నది మీరే తేల్చుకోవాల్సిందిగా ఆదేశించింది.
43 మిల్లుల నుంచి..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2024–25 యాసంగి సీజన్ వరకు ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని పొంది సీఎంఆర్ ఇవ్వని మిల్లుల నుంచి బకాయిలు రాబట్టాలని పౌరసరఫరాల శాఖ ప్రయత్నిస్తోంది. జిల్లాలో 43 మిల్లుల నుంచి ప్రభుత్వానికి రూ.660 కోట్ల విలువచేసే సీఎంఆర్ రావాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మిల్లర్ల నుంచి 45 రోజుల్లోగా సన్నబియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే మిల్లుల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్న అధికారులు.. మిల్లు యాజమానులతోపాటు కుటుంబ సభ్యుల ఆస్తులను సైతం గుర్తిస్తున్నారు.
45 రోజుల గడువు విధింపు
రూ.660 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయి పడిన 43 మిల్లులు
సన్న బియ్యం సేకరణకు
అధికారుల ప్రయత్నాలు


