వారంలోగా ఇళ్ల పనులు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

వారంలోగా ఇళ్ల పనులు ప్రారంభించాలి

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. శనివారం సూర్యాపేటలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో నిర్మాణాలు పూర్తిచేసి వచ్చే జనవరి 26 నాటికి గృహప్రవేశాలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత, టూరిజం శాఖ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వేణారెడ్డి, హౌసింగ్‌ పీడీ జబ్బర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంత్‌రెడ్డి, మున్సిప ల్‌ వైస్‌ చైర్మన్‌ షఫిఉల్లా, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గట్టు శ్రీను, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వేణుగోపాల్‌, వెలుగు వెంకన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

బాధ్యతాయుతంగా నిర్వహించాలి

జనగణనను తప్పులు లేకుండా బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో చార్జ్‌ ఆఫీసర్స్‌, అదనపు చార్జ్‌ ఆఫీసర్స్‌, జిల్లా అధికారులకు నిర్వహించిన శిక్షణలో మాట్లాడారు.

దేశ సమగ్రతను కాపాడాలి

దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభబాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్‌, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎస్‌ఓ మోహన్‌బాబు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement