ధాన్యం కొనుగోళ్లకు టోకెన్‌ విధానం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు టోకెన్‌ విధానం

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లకు సోమవారం నుంచి టోకెన్‌ విధానం అమలు చేస్తున్నట్లు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎల్సోజు చామంతినరేష్‌ వెల్లడించారు. శనివారం ఆమె తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిరోజూ 15 వేల బస్తాలకు టోకెన్లను కమీషన్‌దారుల ద్వారా రైతులు పొందాలన్నారు. టోకెన్‌లు పొందిన రైతులు మాత్రమే మార్కెట్‌కు ధాన్యం తీసుకొని రావాలని కోరారు. టోకెన్‌ దొరకని రైతులు మార్కెట్‌కు ధాన్యం తీసుకు రావొద్దని, మరుసటి రోజు టోకెన్‌ తీసుకొని రావాలన్నారు. అపరాలకు, మొక్కజొన్నలకు ఎలాంటి టోకెన్‌లు అవసరం లేదని తెలిపారు. అనంతరం హమాలీ యూనియన్‌ నేతలతో అధికారులు, మార్కెట్‌ పాలక వర్గం సమావేశమైంది. మార్కెట్‌లో ధాన్యానికి గోనె సంచులను వినియోగించడంపై నవంబర్‌ 7వ తేదీ వరకు పాత విధానమే (గోనె సంచులు, ప్లాస్టిక్‌ బస్తాలు రెండు రకాలు ఇవ్వడం)అమలులో ఉంటుందని చైర్‌పర్సన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి దామోదర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాలెపు చంద్రశేఖర్‌, డీఏఓ హరిప్రసాద్‌, తహసీల్దార్‌ వినోద్‌కుమార్‌, హమాలీ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్‌, మార్కెట్‌ సెక్రెటరీ శంషేర్‌, సంకెపల్లి కొండల్‌రెడ్డి, రాపాక సోమేష్‌, దామెర కృష్ణమూర్తి, సామ ఆంజనేయులు, సుధాకర్‌, ఉప్పలయ్య, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సోమవారం నుంచి అమలు

తిరుమలగిరి మార్కెట్‌ కమిటీ

చైర్‌పర్సన్‌ చామంతినరేష్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement