సూర్యాపేటటౌన్ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభబాయ్ పటేల్ ఆశయానికనుగుణంగా యువత దేశాభివృద్ధికి పాటుపడాలని ఎస్పీ నరసింహ కోరారు. పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినో త్సవాన్ని పురస్కరించుకొని శనివారం సూర్యాపేటలో రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. సద్దుల చెరువు వద్ద పటేల్ చిత్రపటానికి ఎస్పీ నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.


