రాష్ట్రస్థాయి రోల్‌ప్లే పోటీలకు ఇమాంపేట విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి రోల్‌ప్లే పోటీలకు ఇమాంపేట విద్యార్థులు

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

సూర్యాపేటటౌన్‌ : జిల్లా స్థాయిలో నిర్వహించిన రోల్‌ప్లే పోటీల్లో సూర్యాపేట మండలం ఇమాంపేట మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చాటారు. గురువారం జిల్లా బాలభవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రోల్‌ప్లే పోటీల్లో ఇమాంపేట మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ‘మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, యాజమాన్యం’ అనే అంశంపై ప్రదర్శించిన రోల్‌ప్లే విశేషంగా ఆకట్టుకుంది. దీంతో వీరు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్‌ మొదటి వారంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో ఇమాంపేట పాఠశాలకు చెందిన గుగులోతు శ్రేయసి, కట్ట అక్షర, సమీక్ష, రేకల మాథ్యూ కుమార్‌, సలిగంటి తరుణ్‌సాయిలు పాల్గొన్నారు. దండెం రవికుమార్‌ గైడ్‌ టీచర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను డీఈఓ చావా శ్రీనివాసరావు అభినందించారు.

లైంగిక నేరాలపై

అవగాహన ఉండాలి

● సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌

చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు లైంగిక నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘సురక్షిత బచ్‌పన్‌ అభియాన్‌’, ‘లైంగిక నేరాల చట్టం’ (పోక్సో) అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లలు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌లపై విద్యార్థులకు వివరించారు. బాధిత పిల్లలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వా రా ఉచితంగా న్యాయసలహాలు, అందజేస్తామని తెలిపారు. అనంతరం ప్రొజెక్టర్‌ ద్వారా లైంగిక నేరాల తీరుతెన్నులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్‌ సభ్యులు గుంటూరు మధు, నమమత, ప్రిన్సిపాల్‌ నాగరాణి పాల్గొన్నారు.

నారసింహుడి

నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీ ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నూతన పట్టు వస్త్రాలతో స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణ తంతును విష్వక్సేన ఆరాధన, మధుపర్క పూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా పూర్తిచేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement