ప్రతిభా పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ ! | - | Sakshi
Sakshi News home page

ప్రతిభా పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ !

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం

కోదాడ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభావంతులైన పేద విద్యార్థులను గుర్తించి, వారిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కీం (ఎన్‌ఎంఎంఎస్‌) ప్రవేశ పరీక్షలో కొందరు స్వార్థపరులు మాస్‌ కాపీయింగ్‌కు తెరతీస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ పరీక్ష నిర్వహణలో వారికే కీలక బాధ్యతలు అప్పగిస్తుండడంతో కావాల్సిన వారికి సాయమందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరుగుతుందంటే...

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడానికి 8వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం నవంబర్‌ నెలలో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 9 నుంచి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం రూ.12 వేల చొప్పున అందిస్తుంది. ఈ పరీక్షను కోదాడతో పాటు జిల్లా కేంద్రంలోని కొన్ని సెంటర్లలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే హెచ్‌ఎంలను డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు (డీఓ)లుగా నియమిస్తుంటారు. పరీక్ష జరిగే సెంటర్‌ హెచ్‌ఎంలు చీఫ్‌ సూపరింటెండెంట్లు (సీఎస్‌)లుగా వ్యవహరిస్తారు. ఈ పరీక్షల్లో కీలకమైన ఈ ఇద్దరు అధికారులను ప్రసన్నం చేసుకొని తమ పాఠశాల విద్యార్థులు, తమకు కావాల్సిన వారు ఎక్కువ మంది ఎంపికయ్యేలా చేయాలనే దురుద్దేశంతో కొందరు హెచ్‌ఎంలు అక్రమాలకు తెరతీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డ్యూటీల కోసం కొందరు పోటీ

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష నిర్వహణ డ్యూటీల కోసం కొందరు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారని ఆరోపణలున్నాయి. సాధారణంగా సబ్జెక్ట్‌ టీచర్లకు డ్యూటీలు వేయకుండా ఇతరులకు డ్యూటీలు వేయాల్సి ఉంటుంది. కానీ డీఓలు, సీఎస్‌లు తమకు అనుకూలంగా వ్యవహరించే వారికి ఇన్విజిలేటర్లుగా డ్యూటీలు వేసుకుంటారు. తెలివైన విద్యార్థి రాసే జవాబులను తమకు కావాల్సిన విద్యార్థులకు అందించడం వీరి పని. కలెక్టరు స్పందించి, ప్రతిభావంతులకు న్యాయం జరిగేలా ఈ పరీక్షను నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో అక్రమాలు

సూత్రధారులుగా కొందరు టీచర్లు

పకడ్బందీగా నిర్వహించాలని

విద్యార్థుల తల్లిదండ్రుల వేడుకోలు

నవంబర్‌ 1 జరిగే ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మాస్‌ కాపీయింగ్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇన్విజిలేటర్లుగా సబ్జెక్ట్‌ టీచర్లను వేయం. బోధనతో సంబంధం లేనివారినే నియమిస్తాం.

– సలీం షరీఫ్‌,

మండల విద్యాధికారి, కోదాడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement