డిక్లరేషన్‌ అమలు చేయకపోవడం సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

డిక్లరేషన్‌ అమలు చేయకపోవడం సిగ్గుచేటు

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

హుజూర్‌నగర్‌, చివ్వెంల : కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్లలో ప్రకటించిన గిరిజన డిక్లరేషన్‌ను ఇప్పటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటని సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్‌ నాయక్‌ విమర్శించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ‘గిరిజన గళం– తండాలో నిద్ర’ యాత్ర శుక్రవారం జిల్లాలోని హుజూర్‌నగర్‌, చివ్వెంల మండలాలకు చేరింది. హుజూర్‌నగర్‌, బద్యా తండాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గిరిజనుల ఓట్లతోనే గెలిచామన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. నేడు తండాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు నామినేటెడ్‌ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాష్ట్ర రాజధానిలో సేవాలాల్‌ మహారాజ్‌ మందిరాన్ని నిర్మించడంతో పాటు ‘గోర్‌ ట్రైబల్‌ మ్యూజియం’ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సేవాలాల్‌ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధరావతు రాజేష్‌ నాయక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా నాగు నాయక్‌, గిరిజన నాయకులు, సర్పంచ్‌లు నగేష్‌ రాథోడ్‌, వెంకట్రాం, రవి, రవీందర్‌, రాజేశ్‌, బాలు, శివరాం, చక్రు, కృష్ణ, శ్రీను, నాగరాజు, నరసింహ, సైదా నాయక్‌, భానోతు కిషన్‌, నాగులు, వీరన్న, చందు, హేమ్లా, రాముడు, భాష్య, చిరంజీవి, సురేష్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు

బానోతు హుస్సేన్‌ నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement