నిరుద్యోగ యువతకు స్కిల్‌ ట్రైనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు స్కిల్‌ ట్రైనింగ్‌

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

భానుపురి(సూర్యాపేట) : జిల్లాలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను సర్వే ద్వారా గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రత్యేక శిక్షణ కోర్సులు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌ఐఈఎల్‌ఐటీ, ఆర్సెట్టి, సీఐటీడీ, టాస్క్‌ సంస్థల సమన్వయంతో యువతకు శిక్షణ, ధ్రువీకరణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. టాస్క్‌ సమన్వయంతో జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ డి.ప్రేమ్‌ రాజు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఎం.ఎ.భారతి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సత్యనారాయణ రెడ్డి, ఎన్‌ఐఈఎల్‌ఐటీ ప్రతినిధి డాక్టర్‌ లక్ష్మణ్‌, ఎన్‌ఎస్‌డీసీ ప్రతినిధి ప్రతాప్‌ చారి, ఎస్‌బీఐ ప్రతినిధి వాల్యా నాయక్‌, సూర్యాపేట పాలిటెక్నిక్‌ కళాశాల సీనియర్‌ లెక్చరర్‌ వజ్రయ్య, హుజూర్‌నగర్‌ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల ఓటరు

నమోదుకు 6 చివరి తేదీ

శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు నవంబర్‌ 6 చివరి తేదీ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రులు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌ https://ceotelangana.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement