ఇమ్యూనైజేషన్‌ లక్ష్యాలను సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఇమ్యూనైజేషన్‌ లక్ష్యాలను సాధించాలి

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

పెన్‌పహాడ్‌ : సార్వత్రిక టీకాల పెంపు లక్ష్యంగా నిర్వహిస్తున్న ఇంటెన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనుష్‌ స్పెషల్‌ డ్రైవ్‌ వ్యాక్సీకరణ సెషన్లను వంద శాతం విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పెండెం వెంకటరమణ ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ పరిధిలోని 10 ఆరోగ్య ఉపకేంద్రాల వారీగా నిర్దేశించిన ఇమ్యూనైజేషన్‌ లక్ష్యాలు ఎంత, ఇప్పటివరకు సాధించిన ప్రగతి ఎంత అనే వివరాలపై సబ్‌సెంటర్ల వారీగా సమీక్షించారు. అర్హులైన చిన్నారులు, గర్భిణులు ఎవరూ టీకాలకు దూరం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ కోటిరత్నం, జిల్లా ఉప మాస్‌ మీడియా అధికారి సంజీవరెడ్డి, జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, వైద్యాధికారి రాజేష్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ సైదమ్మ, పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ బెల్లంకొండ పద్మ, ఆరోగ్య విస్తరణ అధికారులు శ్రీనివాసులు, ప్రభాకర్‌, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెండెం వెంకటరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement