విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఇతర రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో విద్యాప్రమాణాలు పెంచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం, ఆరోగ్యం, భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని, వివరాలను సేకరించి, ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలలోగా కలెక్టరేట్‌లోని పర్ఫార్మెన్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ బృందానికి నివేదించాలని ఆదేశించారు. జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో వసతి గృహాలు, గురుకులాల్లో నీటి వసతిపై ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నవంబర్‌ 5న సమగ్ర క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇందులో సంస్థల వారీగా అన్ని విషయాలు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి విశాల్‌, డీఎస్‌సీడీఓ లత, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ రవితేజ, అనూష పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement