పెన్‌పహాడ్ : గ్రామాల్లో జల సంరక్షణ పనులను వేగవంతం చేయాలని డీఆర్‌డీఓ సన్యాసయ్య సూచించారు. బుధవారం మండలంలోని సింగారెడ్డిపాలెంలో వీబీ జీరామ్‌జీ పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం లక్ష్యంగా ఫాంపాండ్లు, ఇంకుడు గుంతలు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్, బోర్‌వెల్ రీచార్జ్ పనులను చేపడుతున్నట్లు చెప్పారు. కూలీలకు కొలతల ప్రకారం పనిచేసి పూర్తి వేతనం పొందేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఏపీఓ రవి, ఈసీ మహేష్, పంచాయతీ కార్యదర్శి అఖిల్, టీఏ ఏకస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ జ్యోతి ఉన్నారు.


