కరువు సహాయక చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి. కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ముప్పుపై కొంతకాలంగా వాతావరణశాఖ, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని విమర్శించారు. జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారిక నివేదికలు చెబుతున్నప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కరువుపై రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వారికి భరోసా కల్పించాలన్నారు. ఉపాధి పనులను కొనసాగించాలని, ప్రతి ఒక్కరికీ 200 రోజుల పని కల్పించాలని, కూలి రూ.800 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కునుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్‌, నాయకులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, మేకల కనకారావు, నాగయ్య, సంజీవరెడ్డి, లింగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మైబెల్లి, పోరెండ్ల దశరథ, జిల్లేరు, కోట మధుసూదన్‌, ఐఎప్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి గంటా నాగయ్య, పోలెబోయిన కిరణ్‌, మధు, నల్లగొండ నాగయ్య, పుల్లూరి సింహాద్రి, బొల్లె వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement