పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవాలి

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

సూర్యాపేటటౌన్‌ : పోలీసు అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం చౌరస్తా నుంచి ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్వీ కళాశాల వద్ద పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, అర్ముడ్‌ డీఎస్పీ నరసింహాచారి, సీఐలు రాజశేఖర్‌, వెంకటయ్య, రామారావు, శివ కుమార్‌, ఆర్‌ఐలు నారాయణరాజు, ప్రవీణ్‌కుమార్‌, జానయ్య, ఆర్‌ఎస్‌ఐ సురేష్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సైబర్‌ మోసాలపై అవగాహన

సూర్యాపేటటౌన్‌ : సైబర్‌ మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. సైబర్‌ నేరాలపై జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. తక్కువ సమయంలో, కొద్దిపాటి పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని ఎవరైనా ఆశ చూపితే వాటిని నమ్మవద్దని సూచించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చని చెప్పే ఆఫర్ల వెనుక మోసాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో సైబర్‌ సెక్యూరిటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్లు వెంకటయ్య, శివకుమార్‌, ఎస్‌ఐ సందీప్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement