తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు తాము తీసుకొచ్చిన ధాన్యానికి ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు మంగళవారం మార్కెట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం సూర్యాపేట– జనగామ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సోమవారం రైతులు రాస్తారోకో చేయడంతో మార్కెట్ చైర్పర్సన్ ఏమోజు చామంతి నరేష్ రైతులతో మాట్లాడి క్వింటాకు రూ.50 అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే మంగళవారం మళ్లీ ధర తగ్గించారంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. మార్కెట్ చైర్‌పర్సన్‌తో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులు, నాగారం సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ వెంకట్‌రెడ్డి రైతులతో మాట్లాడారు. క్వింటాకు రూ.50 అదనంగా ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.


