భూసార పరిరక్షణ చాలా ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

భూసార పరిరక్షణ చాలా ముఖ్యం

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

తుంగతుర్తి : భూసార పరిరక్షణ చాలా ముఖ్యమని, తద్వారానే భవిష్యత్తు తరాలకు సారవంతమైన నేల అందుతుందని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ కిరణ్‌ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ రైతు వేదికలో ఖేత్‌ బచావో అభియాన్‌లో భాగంగా నేల ఆరోగ్య పరిరక్షణ, భూసారం పెంపు, సమతుల్య ఎరువుల వినియోగం, ఎల్‌నినోతో వాతావరణ మార్పుల ప్రభావాలపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సేంద్రియ పదార్థాల వినియోగం ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించాలన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు యాసంగిలో వరిసాగుకు బదులు నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఉద్యాన పంటలు సాగుచేయాలన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చింతకుంట్ల వెంకన్న, వ్యవసాయ అధికారి దేవప్రసాద్‌, వ్యవసాయ విస్తరణ అధికారి జ్యోత్స్న, హార్టికల్చర్‌ అధికారి ఎం.రాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌, రైతులు పాల్గొన్నారు.

శివయ్యకు పుష్పార్చన

మేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి ప్రత్యేకంగా అలంకరించి పుష్పార్చన, ఇతర పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పాల్గొన్నారు.

‘పది’లో ఉత్తమ

ఫలితాల సాధనకు కృషి

అర్వపల్లి : టెన్త్‌ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనకు టీచర్ల కృషిచేయాలని డీఈఓ చామ శ్రీనివాసరావు అన్నారు. అర్వపల్లిలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులను చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పాఠశాలలోని సైన్స్‌ల్యాబ్‌, ఏటీఎల్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విభాగం, క్రీడా విభాగాలను పరిశీలించి హెచ్‌ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం కేజీబీవీ కళాశాలను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్‌ఎస్‌లో డీఈఓను సన్మానించారు. ఆయన వెంట హెచ్‌ఎం పి.మల్లేష్‌, ఉపాధ్యాయులు శ్రీదేవి, విమల ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement