రక్తదానం చేసి ప్రాణదాతలు కండి | - | Sakshi
Sakshi News home page

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

సూర్యాపేటటౌన్‌ : ఆరోగ్యవంతమైన యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ మాసోత్సవాల్లో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాల జ్ఞాపకార్థం సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎస్పీ మొదటగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీఎస్పీ నరసింహాచారి, సీఐలు నాగేశ్వరరావు, రామారావు, శివకుమార్‌, ఆర్‌ఐలు ప్రవీణ్‌, జానయ్య, ఎస్‌ఐలు, సిబ్బంది మొత్తం 150 మందికిపైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ అమరవీరుల త్యాగాల స్మారకంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంతో ఖమ్మంకు చెందిన తలసేమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ వారు వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీతోపాటు సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, పోలీస్‌ సంఘం అధ్యక్షులు రమేష్‌, శంకర్‌ నాయక్‌, కార్యదర్శి కిరణ్‌, సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

నేడు బైక్‌ ర్యాలీ

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ (పోలీస్‌ ఫ్లాగ్‌ డే) కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పోలీస్‌ సేవలు వేగవంతం చేయాలి

ప్రజా ఫిర్యాదులపై పోలీస్‌ సేవలు వేగవంతం చేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వినతులను పరిశీలించారు. బాధితులకు భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రజారక్షణలో పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.

ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement