హుజూర్‌నగర్ (నేరేడుచర్ల) : ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్‌సీని అమలు చేసి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకోవాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం నేరేడుచర్లలోని అంజలి హైస్కూల్‌లో జరిగిన సంఘం నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి మండలాల మహాసభలో ఆయన మాట్లాడారు. 2024లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 రోజుల్లోనే పెండింగ్ డీఏలు, పీఆర్‌సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీని నేటికీ నిలుపుకోలేక పోయిందన్నారు. నాలుగు నెలల కరువు భత్యం ఇవ్వలేదన్నారు. కొత్త బడుల ఏర్పాటుకు బదులుగా ఉన్న పాఠశాలను అభివృద్ధి చేసి మౌళిక వసతులు కల్పించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి బాల సైదిరెడ్డి, జిల్లా అడిట్ కమిటీ కన్వీనర్ ఎన్.సాంబయ్య, ఆయా మండలాల అధ్యక్షులు శ్రీనయ్య, బి.నాగేశ్వర్‌రావు, పి.వెంకటేశ్వర్లు, నాయకులు అక్కయ్యబాబు, ఎల్. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


