ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్టు కెప్టెన్‌గా హర్షవర్ధన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్టు కెప్టెన్‌గా హర్షవర్ధన్‌

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న హర్షవర్ధన్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా వాలీబాల్‌ టీం కెప్టెన్‌గా ఎంపికై నట్లు ఎన్‌ఎస్‌పీ క్యాంప్‌ హైస్కూల్‌ పీడీ దేవిశెట్టి రవి తెలిపారు. ఆదివారం మిర్యాలగూడలో జరిగిన ఖేలో ఇండియా 18 ఏళ్ల లోపు బాలుర ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి వాలీబాల్‌ జట్టు ఎంపిక పోటీలో హర్షవర్ధన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం అతను సిద్దిపేటలోని వాలీబాల్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

ఎల్‌నినోపై అవగాహన

సూర్యాపేట(సూర్యాపేటటౌన్‌) : ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, రైతులు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్‌ ఆదివారం పట్టణంలో అవగాహన కల్పించారు. రైతు వేషధారణలో ఎల్‌నినోపై ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ ఎల్‌నినో వల్ల వ్యవసాయంతో పాటు ఇతర రంగాలపై పడే ప్రభావాన్ని ప్రజలకు వివరించారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నేడు పోలీస్‌ కార్యాలయంలో రక్తదాన శిబిరం

సూర్యాపేట(సూర్యాపేటటౌన్‌) : పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్పీ నరసింహ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు, యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో రక్తదానంపై అవగాహన పెంపొందించడం, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు స్వామివారి నిత్య కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదట ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement