సూర్యాపేటకు బుల్లెట్‌ రైలు కనెక్టివిటీ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సూర్యాపేటకు బుల్లెట్‌ రైలు కనెక్టివిటీ కల్పించాలి

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

సూర్యాపేట(భానుపురి) : సూర్యాపేటకు బుల్లెట్‌ ట్రైన్‌ కనెక్టివిటీ కల్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని అఖిలపక్ష నాయకులు కోరారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డితో పాటు బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి అఖిలపక్ష నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో ఎంపీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సూర్యాపేటకు బుల్లెట్‌ ట్రైన్‌ కనెక్టివిటీ కల్పించే అంశంపై ఆయనతో చర్చించారు. సూర్యాపేట జిల్లా అభివృద్ధి, ఆధునిక రవాణా సౌకర్యాల విస్తరణ, ప్రజలకు వేగవంతమైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జానకిరామ్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకన్ననాయక్‌, నాయకులు పెద్దిరెడ్డి రాజా, ధర్మార్జున్‌రెడ్డి, తండు శ్రీనివాస్‌, రమణాచారి, చల్లమల్ల నర్సింహ, అనంతుల మధు, డేవిడ్‌ కుమార్‌, బూర వెంకటేశ్వర్లు, వనితక్క, భూపతి రాములు, నేరెళ్ల మధుగౌడ్‌, అఖిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement