‘పది’ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నవంబర్‌ 16 | - | Sakshi
Sakshi News home page

‘పది’ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నవంబర్‌ 16

Oct 24 2026 11:07 AM | Updated on Oct 24 2026 11:07 AM

సూర్యాపేటటౌన్‌ : పదో తరగతి, వృత్తివిద్యా కోర్సుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పరీక్షల సంచాలకుల కార్యాలయం ప్రకటించినట్లు డీఈఓ సీహెచ్‌. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2027లో నిర్వహించనున్న వార్షిక పరీక్షలకు ఈ నెల 30 నుంచి నవంబర్‌ 16 వరకు అపరాధ రుజుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆ తరువాత రూ.50, రూ.200, రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు రూ.125, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలని సూచించారు. ఫీజును www. bre. telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పాఠశాల లాగిన్‌తో ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని సూచించారు. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం అందించి ఫీజుల చెల్లింపు, నామినల్‌ రోల్స్‌ సమర్పణను సకాలంలో పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.

పోలీసు అమరుల సేవలు చిరస్మరణీయం

సూర్యాపేటటౌన్‌ : ప్రజల రక్షణకోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమవీరుల సేవలు చిరస్మరణీయమని అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి అన్నారు. పోలీసు ఫ్లాగ్‌ డే వారోత్సవాలు, పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలో ఉన్న పోలీసు అమరుడు హెడ్‌ కానిస్టేబుల్‌ బడే సాహెబ్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బడే సాహెబ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ 2వేల సంవత్సరంలో తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేసిన సమయంలో విధుల్లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ బడే సాహెబ్‌ వారితో వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడని గుర్తుచేశారు. కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌, కార్యదర్శి కిరణ్‌ పాల్గొన్నారు.

ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయం

సూర్యాపేటటౌన్‌ : ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయంగా బోధన సాగాలని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి సులోచనారాణి అన్నారు. అధ్యాపకులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. విద్యా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి అధ్యాపకులకు దిశానిర్దేశం చేశారు.కళాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్‌ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

గెస్ట్‌ ఫ్యాకల్టీ కోసం

ఇంటర్వ్యూలు

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులు బోధించేందుకు గెస్ట్‌ ఫ్యాకల్టీ అవసరమై ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.శ్రీవాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల 28న కళాశాలలో నిర్వహించే డెమో, ఇంటర్వ్యూలో పాల్గొనాలని ఆమె సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, సెట్‌/నెట్‌ అర్హత లేదా పీహెచ్‌డీ సర్టిఫికెట్‌, బయోడేటాతో ఉదయం 10 గంటలకు కళాశాలలో హాజరుకావాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement