సూర్యాపేట అర్బన్ : వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో రైతులు సాగు చేసిన వరి పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నదని టీజీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ వి.శివాజీ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం రాయన్‌గూడెం గ్రామంలో రైతుల పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట సూర్యాపేట సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.యాదగిరి, డీఈ ఎన్. వెంకటకృష్ణయ్య, టౌన్ ఆపరేషన్స్ ఏడీఈ ఎల్. శ్రీనివాసరావు, రూరల్ ఏడీఈ వి. రాములునాయక్, పట్టణ, రూరల్ విద్యుత్ సిబ్బంది ఉన్నారు.


